The Hundred Women’s Champions: ద హండ్రెడ్ ఉమెన్స్ 2026 ఫైనల్‌లో కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఘోర పరాజయం ఎదురైంది. లార్డ్స్ చారిత్రక మైదానంలో జరిగిన టైటిల్ పోరులో ట్రెంట్ రాకెట్స్ అన్ని విభాగాలలో ఆధిపత్యం ప్రదర్శించింది. సన్‌రైజర్స్ లీడ్స్‌ను ఏకంగా 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రెంట్ రాకెట్స్ ది హండ్రెడ్ ఉమెన్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ లీడ్స్ బ్యాటర్లు ట్రెంట్ రాకెట్స్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత ఎక్కడ కూడా కోలుకోలేకపోయింది. బ్రయోనీ స్మిత్, లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, ఫోబీ లిచ్‌ఫీల్డ్ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత దీప్తి శర్మ 12 పరుగులు చేసి చార్లీ ఫిలిప్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. అనాబెల్ సదర్లాండ్‌ను జార్జియా ఆడమ్స్ అద్భుతమైన టర్న్‌తో స్టంపౌట్ చేయగా, జెస్ జోనాసెన్ డకౌట్‌గా రనౌట్ అయింది. దీంతో సన్‌రైజర్స్ లీడ్స్ కేవలం 100 పరుగులు కూడా చేయలేక 91 పరుగులకే ఆలౌట్ అయింది. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Trent Rockets Women won The Hundred ❤️🔥👏🏻
Time for the Men’s team to recreate it today. pic.twitter.com/UNwwkEnogF
— Mateo (@MateoCSK) August 16, 2026
ట్రెంట్ రాకెట్స్ 92 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగగా.. సోఫియా డంక్లీ, బెత్ మూనీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కేవలం 40 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. సోఫియా డంక్లీ కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి సన్‌రైజర్స్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. మరోవైపు బెత్ మూనీ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. చివర్లో కెప్టెన్ యాష్లే గార్డ్నర్ బౌండరీ బాది ట్రెంట్ రాకెట్స్‌కు ఘన విజయాన్ని అందించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ట్రెంట్ రాకెట్స్.. మరో 46 బంతులు మిగిలుండగానే 92 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ది హండ్రెడ్ ఉమెన్స్ 2026 ఫైనల్‌లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

