Marriage : పెళ్లికి ముందే విరిగిన మంచం… ముఖం చాటేసిన వరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage : కాసేపట్లో పెళ్లి.. మండపంలో మతపెద్ద అన్నీ సిద్ధం చేసుకుని పెళ్లి చేయించేందుకు రెడీగా ఉన్నాడు. పెళ్లి కూతురు కూడా పెళ్లి బట్టలు ధరించి మండపంలోకి మత పెద్ద ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో పెళ్లికొడుకు ఎక్కడా అంటూ మతపెద్ద పిలుపు రానే వచ్చింది. హా ఇక్కడే అంటూ పెళ్లి కొడుకు.. మండపంలోకి రమ్మంటే రానని భీష్మించుకున్నాడు. ఏంటి నాయనా ఏమైంది అని అడుగగా నాకు ఈ పెళ్లి వద్దన్నాడు. విన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏమైంది చెప్పు అని అడుగగా అతడు చెప్పిన మాటలకు బంధువులంతా కంగుతిన్నారు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్ లో ఆదివారం చోటుచేసుకుంది. మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కాగా పెళ్లికొడుకు, పెళ్లికూతురుకు ఇది రెండో పెళ్లి. అయితే అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన వస్తువులనే వరుడికి పెట్టిపోతల కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు.
Read Also: KTR: రూ.400కోట్లతో గ్లాండ్ ఫార్మా విస్తరణ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్
Also Read
- Iran Oil: భారీ డిస్కౌంట్‌తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- DMK: స్టాలిన్‌కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్‌బై
అయితే మంచం మాత్రం కొత్తది కొనివ్వాలని వరుడు షరతు పెట్టాడు. అందుకు వధువు తండ్రి అంగీకరించాడు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మంచం విడి భాగాలు బిగిస్తుండగా విరిగిపోయింది దీంతో పాత మంచాలు పంపించారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకేముంది ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మరికాసేపట్లో పెళ్లనగా వరుడు మండపం వద్దకు రాలేదు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. ఎంతసేపటికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో పాత మంచం పెట్టారని, విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు మండిపడ్డాడు. కోపంతో అతని కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. కొత్త మంచం పెట్టమంటే పాతదానికి రంగులేసి పంపిస్తారా అంటు కోపోద్రిక్తుడయ్యాడు. ఈ పెళ్లి క్యాన్సిల్ అని తేల్చి చెప్పారు. పెళ్లి రోజు వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని వధువు తరుఫు వారు బతిమాలినా వరుడు వినలేదు. దీంతో చేసేదేం లేక పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడిపై 420 కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్‌తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!