NTV Telugu Site icon

Elderly man song: తాత నువ్వు సూపరేహే..ఒక్క పాటతో మనసుదోచుకున్నావు..

Thata

Thata

టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని ఓ వృద్ధుడు నిరూపించాడు.. తన అద్భుతమైన గొంతుతో పంజాబీ పాట పాడి అందరిని అలరించాడు.. పాటకు తగ్గట్టుగా బిందె మీద దరువేస్తూ పాడుతున్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి ఆయన సంగీతంలో లీనమై పాడుతున్న తీరు జనాలను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం ఈ పాటకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ పెద్దాయనకి పాటలు పాడటం హాబీ కావచ్చు. అందుకు ఆయన కంఠం.. ఇంట్లో ఉండే వస్తువులే వాయిద్య సంగీతాలు. ఓ పాత పాత్రని సంగీత పరికరంగా మలుచుకుని ‘జిదా దిల్ తుట్ ​​జాయే’ అనే అద్భుతమైన పంజాబీ పాటను పాడుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నాడు..ఈ పాటలో స్క్రీన్ మీద నూర్జహాన్ నటించారు. ఇక పెద్దాయన వీడియో చూసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

ఆ వీడియోను చూసిన వారంతా కూడా అతనిపై పొగడ్తలతో అభినందిస్తున్నారు..బిందెను సంగీత వాయిద్యంగా మార్చుకుని, పాటకు తగ్గట్టుగా చేతులతో శబ్దాలు చేస్తూ ఆశ్చర్యపరిచారు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మరో నెటిజన్‌ పాట నుండి సెటప్‌ వరకు అందంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ‘పంజాబీ జానపద గాయాన్ని అద్భుతంగా పాడారు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..