NTV Telugu Site icon

Pawan kalyan : రామోజీని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan kalyan :ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేడు అనారోగ్యంతో మరణించారు..గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావును ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది.దీనితో ఆయనను ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంచారు.వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రస్తుతం రామోజీరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.రామోజీరావు మన మధ్య లేరనే వార్త తెలుసుకున్న సినీ,రాజకీయ ప్రముఖులు,అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

Read Also :Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్..

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రామోజీ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  మాట్లాడుతూ రామోజీరావు గారిని చాలా ప్రభుత్వాలు దాదాపు 15 ఏళ్లుగా ఇబ్బంది పెట్టాయి.అయినా కూడా ఎంతో దృడంగా నిలబడ్డారు.ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు..ఆ విషయమే ఆయనతో చెప్పాలి అనుకున్నాను.నా ప్రమాణ స్వీకారం తరువాత ఆయన్ని కలుద్దాం అని అనుకున్నా కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది.ఎందరో జర్నలిస్ట్లు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినవారే వారందరికీ రామోజీరావు గారు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు.ఆయన లేని లోటు తీర్చలేనిది అని పవన్ తెలిపారు.ఆయన పవిత్ర ఆత్మను శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ తెలిపారు.

Show comments