Pawan kalyan : రామోజీని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan kalyan :ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేడు అనారోగ్యంతో మరణించారు..గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావును ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది.దీనితో ఆయనను ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంచారు.వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రస్తుతం రామోజీరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.రామోజీరావు మన మధ్య లేరనే వార్త తెలుసుకున్న సినీ,రాజకీయ ప్రముఖులు,అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
Read Also :Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్..
Also Read
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రామోజీ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రామోజీరావు గారిని చాలా ప్రభుత్వాలు దాదాపు 15 ఏళ్లుగా ఇబ్బంది పెట్టాయి.అయినా కూడా ఎంతో దృడంగా నిలబడ్డారు.ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు..ఆ విషయమే ఆయనతో చెప్పాలి అనుకున్నాను.నా ప్రమాణ స్వీకారం తరువాత ఆయన్ని కలుద్దాం అని అనుకున్నా కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది.ఎందరో జర్నలిస్ట్లు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినవారే వారందరికీ రామోజీరావు గారు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు.ఆయన లేని లోటు తీర్చలేనిది అని పవన్ తెలిపారు.ఆయన పవిత్ర ఆత్మను శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!