తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి వెంటనే జిల్లాలను సందర్శించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి నియమించారు.
Sree Vishnu: మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనేదే కథ : హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ
- కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ R.V.కర్ణన్ నియామకం.
- నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అనితా రామచంద్రన్ నియామకం.
- నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి A.శరత్ నియామకం.
- రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు సెర్ఫ్ సీఈఓ డి.దివ్య నియామకం.
- మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి నియామకం.
- వరంగల్, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు వైద్య శాఖ జాయింట్ సెక్రటరీ T. వినయ్ కృష్ణ రెడ్డి నియామకం.
- మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ హరిచందన దాసరి నియామకం.
- ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె. సురేంద్ర మోహన్ నియామకం.
- హైదరాబాద్ జిల్లాకు జీహెచ్ఎంసి కమిషనర్ అమ్రాపాలి కాటా నియామకం.
China President: మున్ముందు చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది..