పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా. ఆమెకు భారీ నజరానా ప్రకటించారు. దీప్తికి రూ.కోటి నగదు బహుమతితో పాటు.. గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే.. పారాలింపిక్స్లో పార్టిసిపెంట్స్కు కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Chhattisgarh: ఓవైపు యుపీలో తోడేళ్లు.. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో అయిదుగురిని పొట్టన బెట్టుకున్న గజరాజు
పారాలింపిక్స్ మహిళల 400మీటర్ల టీ20 విభాగంలో 20 ఏళ్ల తెలుగు అథ్లెట్ దీప్తి జీవాంజి 55.82 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గతంలో 55.07 సెకన్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది.
Read Also: Duleep Trophy: 7 వికెట్లు, 7 మెయిడిన్లు.. విరుచుకుపడ్డ బౌలర్, ఇంతకీ ఎవరు..?