The Goat : తమిళ స్టార్ హీరో విజయ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ” ది గోట్ ” సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను విక్రమ్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్, టీజర్ అంచనాలకు నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక నేడు హీరో విజయ్ పుట్టినరోజును పునస్కరించుకొని సినిమా నుండి చిత్రం బృందం సెకండ్ సింగిల్ సాంగును విడుదల చేసింది.
Amarnath Yatra 2024 : అమర్‌నాథ్ పుణ్యక్షేత్రంలో తొలి పూజ పూర్తి..ఈనెల 29 యాత్ర ప్రారంభం
” చిన్న చిన్న కంగల్ ” అంటూ సాగే మెలోడీ సాంగ్ యువన్ శంకర్ రాజా, రాజ భవతారిని పాడారు. ఇక సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా టీజర్ ను చూస్తే.. సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ, జయరాం, ప్రశాంత్, మోహన్, స్నేహ, లైలా లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజ్ కాబోతోంది.
Pawan Kalyan Veeramallu : “వీరమల్లు” షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ ఎప్పుటినుంచంటే..