NTV Telugu Site icon

The Goat Life : సెన్సార్ పూర్తి చేసుకున్న “ది గోట్ లైఫ్”మూవీ.. రన్ టైం ఎంతంటే..?

Whatsapp Image 2024 03 21 At 10.34.38 Am

Whatsapp Image 2024 03 21 At 10.34.38 Am

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. సలార్ సినిమాతో ఈ హీరోకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా పృద్విరాజ్ సుకుమారాన్ నటించిన “ది గోట్ లైఫ్” మూవీ మార్చి 28న పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతోంది.బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్‌లైఫ్ మూవీని తెరకెక్కించారు.తాజాగా ఈ  మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా రన్ టైమ్ కూడా రివీలైంది. రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నిడివితో గోట్‌లైఫ్ తెలుగులో రిలీజ్ కానుంది..రెండు గంటల యాభై రెండు నిమిషాల లెంగ్త్‌తో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ సభ్యులు కొన్ని సీన్స్‌కు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. దాంతో పదకొండు నిమిషాలు పైనే సినిమాను ట్రిమ్‌ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి సెన్సార్ నుంచి యూ ఏ సర్టిఫికెట్ వచ్చింది.గోట్‌లైఫ్ సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌, అమలాపాల్ మధ్య లిప్‌లాక్ సీన్ ఉండబోతున్నట్లు సమాచారం.. ఐదు నిమిషాల కంటే ఎక్కువ నిడివితోనే ఈ లిప్‌లాక్ సీన్ ఉంటుందని సమాచారం.

గోట్‌లైఫ్ సినిమాకు ఈ లిప్‌లాక్ హైలైట్‌గా ఉంటుందని మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల కాలంలో ఎక్కువ నిడివి గల లిప్‌లాక్ సీన్ ఉన్న సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. కథ డిమాండ్ మేరకు లిప్‌లాక్ సీన్ పెట్టాల్సివచ్చిందిన ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ తెలిపింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్”ది గోట్ లైఫ్” మూవీకి మ్యూజిక్ అందించారు.ఈ సినిమా నుంచి ‘తేజమే రెహమానేనా..’ అనే లిరికల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు.’తేజమే రెహమానేనా..’ లిరికల్ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా జితిన్ రాజ్ పాడారు. ఎమోషనల్ గా సాగే ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్ కూడా కనిపిస్తారని మేకర్స్ ప్రకటించారు. సినిమా షూటింగ్ జరిగిన ఏడాదికి స్వయంగా వెళ్లిన రెహమాన్ ..అక్కడ హీరో క్యారెక్టర్ పడే సంఘర్షణను, ప్రకృతిని తానూ అనుభూతి చెందుతాడు. ఆ ఫీల్ తోనే ఈ పాట కంపోజ్ చేసినట్లు రెహమాన్ లిరికల్ వీడియోలో వెల్లడించారు.90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” లో చూపించబోతున్నారు.