Bunny Vasu: “అందరికి విజయ్ దేవరకొండ, మాకు మాత్రం బంగారు కొండ” అంటూ నిర్మాత బన్నీ వాస్ విజయ్ ను ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో ప్రశంసించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నవంబర్ 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడంతో ఆ మీట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు విజయ్ దేవరకొండను నిర్మాత బన్నీ వాస్ పొగడ్తలతో ముంచెత్తారు.
READ MORE: KA Paul: జగన్ నన్ను ఎప్పుడూ కష్టపెట్టలేదు.. చంద్రబాబు ఇంకా నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదు..
“ఈ సమయంలో ఎంతోమంది యువతకు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. వారు ఈ చిత్రానికి వెళ్లేందుకు మక్కువ చూపితే వారు సరైన వ్యక్తి, లేదా ఆలోచించుకోవచ్చు” అని అన్నారు. దీక్షిత్ పాత్రను ఎంతోమంది ప్రస్తుతం బయట చర్చించుకుంటున్నారు. అంతగా చర్చించుకునేలా ఆ పాత్ర పండడం విశేషం.
ఈ సినిమాలోని దీక్షిత్ పాత్రకు కనెక్ట్ అయిన ప్రేక్షకులు బయట దీక్షిత్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. దీక్షిత్ ఈ పాత్రలో అంత బాగా నటించారు.
READ MORE: Delhi Car Blast: ఒక దుకాణంపై పడ్డ శరీర భాగాలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు
“నేను నా భార్యతో కలిసి ఈ సినిమాకు వెళ్లాను. తను సినిమా చూసిన తర్వాత నా భుజంపై చేయి వేసి బయటకు తీసుకుని వెళ్ళింది. అంటే నేను చాలా మంచి భర్తను అని నాకు అర్థమైంది. ఆ విషయం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చింది” అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపారు.
