దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బీహార్, హర్యానా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25వ తేదీన పోలింగ్ జరగబోతుంది. బీహార్ లో 8, హర్యానాలో 10, ఝార్ఖండ్‌లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇవాళ్టి ( సోమవారం ) నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: Flaxseeds Benefits : అవిసె గింజలను ఇలా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు..
ఇక, దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక, ఏడో దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు కొనసాగనున్నాయి. జూన్ 1వ తేదీన ఈ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరిగింది.