NTV Telugu Site icon

Hanuman Statue: ప్రపంచంలోనే ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన

Sachidananda

Sachidananda

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ పూజ్య గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీ శంకుస్థాపన చేశారు. పది కోట్ల రూపాయల వ్యయంతో 178 అడుగులు ఎత్తులో ఈ ఆంజనేయస్వామి విగ్రహన్ని ఏర్పాటు చేయనున్నారు. మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం
మారుతుందన్నారు.

Read Also: Shilpa Shetty : శిల్పా శెట్టి ఇలాంటివి కూడా చేస్తారా?నెటిజన్స్ ఫిదా..

హనుమాన్ విగ్రహ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమం తర్వాత పూజ్య గురువులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహభాష్యం చేశారు. కార్య సిద్ధి పొందాలంటే కారసాధకుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలన్నారు.. హనుమంతుడిని పూజించడం వలన తమ కష్టాలు తీరతాయన్నారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు రాజానగరం నియోజకవర్గ ముఖద్వారంగా ఉందని ఈ ప్రాంతం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరుకోవాలని లక్ష్యంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని దర్శించారు.

Show comments