NTV Telugu Site icon

IND vs NZ: తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..

Cricket

Cricket

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ బెంగళూరులో జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా.. వర్షం కారణంగా తొలి టెస్టులో మొదటి రోజు ఆట రద్దయింది. టాస్ పడకుండానే ఆట రద్దు అయింది. మొదటి, రెండో సెషన్లు రద్దు కావడంతో అంపైర్ తొలిరోజు ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో భారీ వర్షం పడుతుండటంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం మళ్లీ రాకపోతే రేపు ఉదయం 8.45కి టాస్ వేసి 9.15కి మ్యాచ్ ప్రారంభిస్తారు.

Show comments