NTV Telugu Site icon

AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన..

Ap Assembly

Ap Assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది. బడ్జెట్ కసరత్తును ఓ కొలిక్కి తేలేకపోతోంది ఆర్థిక శాఖ. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలా..? రెండు మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? అనే కన్ఫ్యూజన్ లో ఆర్థిక శాఖ ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనలకు పూర్తి వివరాల్లేకపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమనే భావన వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతోనే సమస్య అని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.

Read Also: UK: యూకే నూతన ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం

గత ప్రభుత్వం మాదిరి తప్పుడు లెక్కలతో బడ్జెట్ పెట్టొద్దని అధికారులకు ప్రభుత్వ పెద్దలు ఆదేశం ఇచ్చారు. ఈ క్రమంలో.. ప్రతి శాఖలోనూ లెక్కలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. వివిధ శాఖల ఖాతాల్లో గత రెండు, మూడేళ్లుగా లెక్కలు కొలిక్కి రావడం లేదు. పూర్తి స్థాయి బడ్జెట్ ఈ పరిస్థితుల్లో కష్టమంటూ ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి విషయాల్లో స్పష్టత వచ్చాక పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చనే ప్రతిపాదనలు ఉన్నాయి.

Read Also: Lavanya -Rajtarun : రాజ్‌తరుణ్‌ని వదిలే ప్రసక్తి లేదు