కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తండ్రి ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను బాధ్యులను చేస్తూ.. డ్యూటీలో ఉన్న అమ్మాయికి ఇలాంటివి జరిగితే పూర్తి బాధ్యత ఆస్పత్రిదే అన్నారు. ఆయన మంగళవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఘటన జరిగినా.. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి ఫోన్ కూడా రాలేదని, మా యోగక్షేమాలు కూడా ఆరా తీయలేదన్నారు. ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘటన జరిగిన తర్వాత 6 నుంచి 7 గంటలపాటు తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తనతో ఎవరూ మాట్లాడలేదని తెలిపారు. ప్రిన్సిపాల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు.
READ MORE: Kurnool: హంద్రీ నదిలో చిక్కుకున్న 25 మంది కూలీలు
తండ్రి తన కుమార్తెతో మాట్లాడిన చివరి ఫోన్ సంభాషణను ప్రస్తావించారు. “ఆమె ఆ రోజు రాత్రి 8.10 కి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 11.15 గంటలకు తల్లికి ఫోన్ చేసింది. నేను కూడా అక్కడే ఉండి ఫోన్ వింటున్నాను. మా భోజనం వచ్చిందని ఫోన్‌లో చెప్పింది. అందరం కలిసి భోజనం చేశామని.. మీరు కూడా తిన్నారా? అని అడిగింది. నాతో మాట్లాడుతూ.. ఆహారం తిని మందు వేసుకుని పడుకో అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం 10:53 గంటలకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE:Bihar: పామును నోటితో కరిచి చంపేసిన చిన్నారి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే..!
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మా కుమార్తె మృతదేహాన్ని మొదటిసారి చూశాము. ఎందుకంటే అప్పటి వరకు మృతదేహం పోలీసు స్టేషన్ ఆసుపత్రిలోనే ఉంచారు. పోస్ట్‌మార్టం ఆలస్యమైంది. శవపరీక్ష అనంతరం పోలీసులు హడావుడిగా మృతదేహాన్ని కాల్చడానికి గ్రీన్ కారిడార్‌ను తయారు చేశారు.” అని చెప్పారు. తన కుమార్తె పోస్ట్‌మార్టం నివేదికపై కూడా బాధితురాలి తండ్రి ప్రశ్నలు సంధించారు. చాలా చిత్రహింసలు పెట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
