The Exorcist: Believer : ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ ది ఎగ్జార్సిస్ట్ నుంచి వచ్చిన ఆరో సినిమా ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ జియో సినిమా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి రావడం విశేషం.ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా ఇది. తొలిసారి 1973లో ది ఎగ్జార్సిస్ట్ టైటిల్ తో వచ్చి భయపెట్టిన ఈ మూవీ.. గతేడాది అక్టోబర్ లో ఆరో సీక్వెల్ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీకి కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెసైంది.30 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర 130 మిలియన్ డాలర్లు వసూలు చేయడం గమనార్హం.
గతేడాది అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజైంది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు జియో సినిమాలో ఇండియన్ ఆడియెన్స్ ఈ హారర్ మూవీని చూసే అవకాశం దక్కింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన అన్ని సినిమాలూ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి.ఈ ఆరో సీక్వెల్ కు డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వం వహించాడు. లెస్లీ ఒడోమ్ జూనియర్, లిడియా జెవెట్ మరియు ఒలీవియా ఓనీల్ నటించారు. 1971లో ది ఎగ్జార్సిస్ట్ పేరుతో వచ్చిన నవలను 1973లో తొలిసారి అదే టైటిల్ తో సినిమాగా తెరకెక్కించారు.ఎగ్జార్సిస్ట్ అంటే భూత వైద్యుడు అని అర్థం. ఈ ఫ్రాంచైజీ నుంచి ఆ తర్వాత 1977లో ఎగ్జార్సిస్ట్ 2: ది హెరెటిక్, 1990లో ది ఎగ్జార్సిస్ట్ 3, 2004లో ఎగ్జార్సిస్ట్: ది బిగినింగ్ అలాగే 2005లో డొమినియన్: ప్రీక్వెల్ టు ఎగ్జార్సిస్ట్ మూవీస్ వచ్చాయి. మళ్లీ దాదాపు 18 ఏళ్ల తర్వాత ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ పేరుతో ఈ సీక్వెల్ మూవీ రిలీజైంది.
Also Read
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్తో వస్తోంది!
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..