NTV Telugu Site icon

Shocking Video: రైలు కింద పడ్డ బతికి బట్టకట్టింది.. ఈ కుక్కకు నూకలున్నాయి..!

Dog 1

Dog 1

రైలు కింద పడిన తర్వాత మనిషి కానీ జంతువు కానీ బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఓ కుక్క రైలు కింద పడ్డ బతికి బట్ట కట్టింది. అంతం దగ్గరలో ఉన్నవాడిని విశ్వంలో ఏ శక్తీ రక్షించదు. అలాగని.. మరణం వ్రాయబడని వ్యక్తిని చంపగల శక్తి కూడ లేదు. కొన్నిసార్లు అదృష్టం కొద్దీ ఏదైనా ప్రమాదం నుంచి బయటపడుతారు. ఇప్పుడు కూడా ఈ కుక్క లక్కీగా ప్రాణాల నుంచి బయటపడింది. అయితే అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Minister Malla Reddy: కేసీఆర్ ప్రధాని కావాలని ఆ అమ్మవారిని కోరుకున్నా..

రైలు ప్రమాదానికి గురైన ఓ కుక్క ప్రాణాలతో బయటపడింది. కుక్క ట్రాక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా రైలు తన మీదకు వచ్చింది. చాకచక్యంతో కుక్క తన ప్రాణాలను రక్షించుకుంటుంది. ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ట్రాక్‌పై రైలు వెనుకాల వస్తుండటం మీరు వీడియోలో చూడవచ్చు. అయితే రైలు వేగం కొద్దిగా పెరగడంతో.. కుక్క రైలు కింద పడిపోతుంది. అయినా కుక్కకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతేకాకుండా ఆ కుక్క కొన్ని సెకన్లలో రైలు కింద నుండి బయటపడి పారిపోతుంది.

Naga Chaitanya : త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్న నాగ చైతన్య..?

హృదయాన్ని కదిలించే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ilhanatalay_ అనే IDతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 మిలియన్లు అంటే 12 లక్షల సార్లు వీక్షించారు. అంతేకాకుండా 48 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దేవుడిని నమ్మని వారు ఈ వీడియో తప్పక చూడండి’ అని ఒక యూజర్ అంటుంటే.. మరో యూజర్ ‘జాకో రఖే సైయన్, మార్ సకే నా కోయి’ అని సామెత రాశాడు.