NTV Telugu Site icon

Agricultural Field : చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో కుక్కల బెడద

Charlapally

Charlapally

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో 200 పైగా ఉన్న కుక్కల బెడద అటు జైలు అధికారులను ఇటు ఖైదీలను కలవర పెడుతున్నాయి.గత కొన్ని ఏళ్లుగా చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో ఖైదీలు తిని పడేసిన ఆహారం పదార్థాలు నాన్ వెజ్ వ్యర్ధాలు జైలు పరిసర ప్రాంతాల్లో పడవేయడం వల్ల ఒకటి ఒకటి అయి ఇప్పుడు 200 కుక్కల వరకు పెరిగిపోవడంతో జైల్లో కుక్కలతో భయాందోళనకు గురి అవుతున్నారు. గతంలో జీవిత ఖైదీలపై జైలు అధికారులపై కుక్కలు దాడులకు తెగ బడినాయి.ఈ కుక్కల వల్ల జైలు లోపటికి వెళ్లాలంటే జైలు సిబ్బంది జన్ జక్కుతున్నారు.గతంలో వార్డర్ గడ్డం రమేష్ పై దాడికి తెగ బడినాయి.గతంలో జైలు అధికారులపై కూడా ఎన్నోసార్లు దాడులకు తెగబడినాయి.

Nadendla Manohar: ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు..

కుక్కలను నిర్మూలించడంలో జైలు అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. కుక్కల సంఖ్య రోజుకి పెరిగిపోవడంతో చర్లపళ్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం లోపలికి వెళ్లాలన్న పాలకు కూరగాయలకు వెళ్లాలన్న జనాలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.కుక్కలు మొరగడం అరవడం వల్ల అటువైపు చూడాలన్న జైలుకు వెళ్లే వ్యక్తులు వెళ్లలేకపోతున్నారు. ఇప్పటికైనా రోజురోజుకీ పెరిగిపోతున్న కుక్కల సంఖ్యను నివారించే అటు ఖైదీలను జైలు సిబ్బందిని కాపాడవలసిన బాధ్యత ఉన్నత జైలు అధికారులపై ఉన్నది.

Nepal : నేపాల్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన విమానం