NTV Telugu Site icon

Kanaka Durga Temple: దుర్గగుడిలో మరోసారి బయటపడ్డ చైర్మన్, ఈవో విభేదాలు

Kanaka Durga Temple

Kanaka Durga Temple

Kanaka Durga Temple: బెజవాడలో కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది.. అయితే, దుర్గగుడిలో శాకంబరీ ఉత్సవాల వేళ మరోసారి చైర్మన్, ఈవో మధ్య విభేదాలు బయటపట్టడాయి.. ఈవో భ్రమరాంబ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.. చైర్మన్ కర్నాటి రాంబాబు.. దుర్గగుడి అంతర్గత బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి బదిలీ చేశారు ఈవో.. బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు,‌ సిబ్బందిని మార్చేశారు.. కానీ, శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో చార్జ్‌ తీసుకోలేదు సీసీ.. ఇద్దరు అటెండర్లకు గాను ఒక్క అటెండర్ ను మాత్రమే ఇవ్వడంతో ఈవో పై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈవో తీరుతో ఉన్న ఒక్క అటెండర్ ను కూడా పేషీ నుంచి వెనక్కి పంపించేశారు చైర్మన్‌.. దీంతో.. చైర్మన్ పేషీలో దేవస్ధానం సిబ్బంది ఎవరూ కనిపించడంలేదు.. ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ.. గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు చైర్మన్ కర్నాటి రాంబాబు.. అయినా.. ఈవో వ్యవహార శైలిలో మార్పురాలేదని.. ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌