Delhi Nyay Yatra: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ ఈరోజు నుంచి రాజ్‌ఘాట్ నుంచి ఢిల్లీ న్యాయ యాత్రను ప్రారంభించనుంది. ఈ నెల రోజుల న్యాయ యాత్రలో మొత్తం 70 అసెంబ్లీలు కవర్ చేయబడతాయి. ఈ సమయంలో యాత్ర దాదాపు 360 కి.మీ దూరం ప్రయాణించనుంది. ఈ యాత్రకు ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ నాయకత్వం వహిస్తారు.
Read Also: SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. నవంబర్ 8న యాత్ర ప్రారంభమై.. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగనుంది. ఈ యాత్ర ద్వారా ఢిల్లీ పౌరుల సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని, ఇందులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంటారని తెలిపారు.
Read Also: OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు!
ఈరోజు యాత్ర మధ్యాహ్నం 1 గంటలకు రాజ్‌ఘాట్ నుండి ప్రారంభమై, పాత ఢిల్లీలోని తుర్క్‌మన్ గేట్, బల్లిమారన్ వంటి ప్రాంతాల గుండా వెళుతుంది. తొలిరోజు మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ కన్ను పడింది. గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిపోటీని ప్రదర్శించి కాంగ్రెస్‌ను ఓడించింది.