Site icon NTV Telugu

Raja Saab : ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన మారుతీ

Maruthi

Maruthi

గత సాయంత్రం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంఛ్ ను హైదరాబాద్ లో విమల్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అనంతరం మారుతీ మాట్లాడుతూ ‘ ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాలర్ ఎగరేసుకుంటారు ఇలాంటివి నేను చెప్పలేను ఎందుకంటే, ప్రభాస్ లాంటి కటౌట్ కి అవి చాలా చిన్న మాటలు అయిపోతాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కి కారణం అయ్యాయి. తమ హీరోను ఉద్దేశించి డైరెక్టర్ మారుతీ కామెంట్స్ చేశాడని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని ఎలా అంటే అలా మాట్లాడకూడదని మారుతీపై ట్రోలింగ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

Also Read : Ulaganayagan : 25 ఏళ్ల క్రితం ఆగిపోయిన ప్రాజెక్ట్‌కు మోక్షం

అయితే ఈ వివాదం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గొడవలకు కారణం అవడంతో తన వ్యాక్యలపై మారుతీ వివరణ ఇస్తూ ‘ తాను మాట్లాడిన మాటలకు వ్యక్తిగతంగా స్పష్టత ఇవ్వాలని అనిపించింది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రతి అభిమానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్ లో మాట్లాడేటప్పుడు మనం ఒకటి మాట్లాడితే అది ఇంకొకటిగా బయటకు వస్తుంది. నేను మాట్లాడిన మాటలు మీకు తప్పుగా అనిపించినందుకు నేను చింతిస్తున్నాను. ఎన్టీఆర్ గారు మరియు ఆయన అభిమానులందరి పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. సినిమా పట్ల ఎన్టీఆర్, ఆయన పట్ల మీరు చూపే ప్రేమను నేను నిజంగా విలువైనదిగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను మాట్లాడిన సిచ్యుయేషన్ ని, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

Exit mobile version