NTV Telugu Site icon

Uttar Pradesh: ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు.. గొడ్డలితో నరికి చంపిన కొడుకు

Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ దారుణ ఘటన చోటు చోటుచేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. కొడుకుకి, తల్లికి మధ్య గొడవ జరుగుతుండగా.. దాన్ని పరిష్కరించేందుకు వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు.

Pawan Kalyan: ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.. సీఈసీ చర్యలు తీసుకోవాలి..

నిందితుడు సుబేహా కాలనీలో నివసిస్తున్న అష్ఫాక్‌గా గుర్తించారు పోలీసులు. మృతుడు ఔసాఫ్‌ కూడా అదే కాలనీలో నివసాముంటున్నాడు. అయితే అష్ఫాక్ తల్లికి 55 ఏళ్ల ఔసాఫ్‌తో ప్రేమ వ్యవహారం ఉందని.. ఇద్దరూ ఏకాంతంగా కలిసేవారని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం అష్ఫాక్‌కు కూడా తెలియడంతో తల్లీకొడుకుల మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం కూడా తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో అష్ఫాక్ తల్లి తన ప్రియుడిని ఔసాఫ్‌ను పిలిచింది. అయితే తల్లీకొడుకుల మధ్య గొడవలో ఔసాఫ్ వచ్చి అష్ఫాక్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడని.. కానీ అతన్ని చూడగానే అష్ఫాక్ మరింత కోపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అష్ఫాక్ గొడ్డలితో ఔసాఫ్ పై దాడి చేశాడు.

IPhone 15 Pro: ఐఫోన్ 15 సిరీస్ ఫీచర్స్ అదుర్స్.. Wi-Fi 6E టెక్నాలజీ ప్రో మోడల్స్

అయితే ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఔసఫ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడు అష్ఫాక్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.