NTV Telugu Site icon

Syria Border : పుష్కరం తర్వాత తెరుచుకున్న సిరియా సరిహద్దులు

Turkey

Turkey

Syria Border : సిరియా, తుర్కియే దేశాల మధ్య 12 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు తెరిచారు. దీంతో బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు రెండు సరిహద్దులను తెరవాలని సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ ఆస్సాద్‌ ప్రకటించగానే.. అధికారులు వేగంగా స్పందించి క్రాసింగ్స్‌ ప్రారంభించారు. ఈ సరిహద్దుల గుండా ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు సిరియాలోకి వచ్చేందుకు వీలుచిక్కింది. 2011 లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం తర్వాత ఈ సరిహద్దులను మూసి ఉంచారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు, ఔషధాలు ఇతర సామాగ్రి చేరవేసేందుకు సులువుగా ఉంటుంది. అలాగే ఈ సరిహద్దుల గుండా ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు సిరియాలోకి వచ్చేందుకు వీలుచిక్కింది. 2011 లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం తర్వాత ఈ సరిహద్దులను మూసి ఉంచారు.

Read Also: Mumbai : చెత్త రికార్డును నెలకొల్పిన ముంబై.. కాలుష్యంలో నెం.1

వారం క్రితం టర్కి, సిరియాలో సంభవించిన భూకంపం పెద్ద విలయాన్నే సృష్టించింది. ఈ రెండు దేశాల్లో ఇప్పటివరకు 40 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సహాయ బృందాలను సిరియాకు పంపేందుకు సరిహద్దుల మూసివేత ఇబ్బందికరంగా తయారైంది. దాంతో ఐరాస సూచన మేరకు సిరియా ప్రభుత్వం తుర్కియేతో ఉన్న రెండు సరిహద్దు క్రాసింగ్‌లను ప్రారంభించింది. ఈ సరిహద్దుల ద్వారా ఐరాస సిరియాకు సహాయక సామగ్రిని పంపేందుకు వీలుకలుగుతున్నది. దేశ ప్రజలు సాయం పొందేందుకు ఈ సరిహద్దులు రానున్న మూడు నెలలు తెరిచే ఉంచుతారు. ఐరాస ప్రకారం, సిరియాలో 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు దేశాల్లోని దాదాపు 9 లక్షల మందికి సరైన ఆహారం అందాల్సి ఉన్నది.