Site icon NTV Telugu

45TheMovie : తెలుగులో వారం గ్యాప్ లో రిలీజ్ అవుతున్న కన్నడ బిగ్గెస్ట్ మల్టీస్టారర్

45themovie

45themovie

కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌గా 45 తెరకెక్కుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో శాండల్‌వుడ్ టాప్ హీరోలు ముగ్గురు నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ , రియల్ స్టార్ ఉపేంద్ర , వర్సటైల్ యాక్టర్ రాజ్ B. శెట్టి , కలిసి మల్టీస్టారర్‌గా ఆకట్టుకోనున్నారు. 45 సినిమాపై కన్నడ సినీ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం. రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సంగీత బాధ్యతను కూడా అర్జున్ జన్యనే తీసుకోవడం విశేషం.

Also Read : AvatarFireAndAsh Review : మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకున్న ‘అవతార్ – 3 ఫైర్ అండ్ యాష్’

ఫిలాసాఫికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కస్తూబమణి హీరోయిన్‌గా నటిస్తోంది. లాస్ట్ ఇయర్ యుఐ సినిమాతో ఉపేంద్ర, భైరతి రణగల్తో శివరాజ్ కుమార్ మంచి జోష్‌లో ఉన్నారు. ఇక రుధిరం ఫ్లాప్ తర్వాత రాజ్ బి. శెట్టికి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ సినిమాకు టొరంటోకు చెందిన మార్జ్ అనే వీఎఫ్ఎక్స్ సంస్థ పనిచేస్తుండటం మరో ప్లస్ పాయింట్. 45 సినిమా మన జీవితం, మన ఎంపికలు, వాటి ఫలితాలపై ఆధారపడిన ఫిలాసాఫికల్ డ్రామాగా రూపొందింది. ప్రతి మనిషి జీవితంలో వచ్చే టర్నింగ్ పాయింట్లు, ఒక నిర్ణయం ఎలా భవిష్యత్తునే మార్చేస్తుందో బలమైన కథనంతో చూపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కన్నడతో పాటు తమిళం, హిందీ భాషల్లో డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా, జనవరి 1 న తెలుగు లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version