NTV Telugu Site icon

Royal Enfield: అత్యధికంగా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350..

Royal

Royal

రాయల్ ఎన్ఫీల్డ్ 2024 మే అమ్మకాల బ్రేకప్ డేటాను కంపెనీ విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం 7 మోడళ్లను విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. 4 మోడళ్లు వార్షిక క్షీణత ఎదుర్కోగా, 3 వార్షిక వృద్ధిని సాధించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ గత నెలలో అమ్మకాలు తగ్గాయి. అయితే.. ప్రతిసారీ మాదిరిగానే క్లాసిక్ 350 అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచింది. రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాల డేటా ఎలా ఉందో చూద్దాం.

SDT 18: ఇట్స్ అఫీషియల్.. సాయి ధరమ్ తేజ్‌ తో హనుమాన్ నిర్మాత పాన్ ఇండియా మూవీ..

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350
2024 మేలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350.. 23,779 యూనిట్లను విక్రయించింది. 2023 మేలో 26,350 యూనిట్లను విక్రయించింది. అంటే.. ఈ ఏడాది 2,571 తక్కువ యూనిట్లను విక్రయించింది. 9.76% వార్షిక క్షీణతను పొందింది.

హంటర్ 350
హంటర్ 350.. 2024 మేలో 15,084 యూనిట్లను విక్రయించింది. 2023 మేలో 18,869 యూనిట్లను విక్రయించింది. అంటే.. 3,785 యూనిట్లు తక్కువగా అమ్మారు. 20.06% వార్షిక క్షీణతను పొందింది.

బుల్లెట్ 350
బుల్లెట్ 350.. 2024 మేలో 9,332 యూనిట్లను విక్రయించింది. 2023 మేలో 12,680 యూనిట్లను విక్రయించింది. అంటే.. 3,348 యూనిట్లు తక్కువగా అమ్మారు. 26.4% వార్షిక క్షీణతను పొందింది.

మెటోర్ 350
మెటోర్ 350.. 2024 మేలో 8,189 యూనిట్లను విక్రయించింది. 2023 మేలో 7,024 యూనిట్లను విక్రయించింది. అంటే.. మరో 1,165 యూనిట్లను విక్రయించి.. 16.59% వార్షిక వృద్ధిని సాధించింది.

హిమాలయన్
హిమాలయన్.. 2024 మేలో 3,314 యూనిట్లను విక్రయించింది. 2023 మేలో 4,064 యూనిట్లను విక్రయించింది. అంటే.. 750 యూనిట్లను తక్కువగా విక్రయించింది. 18.45% వార్షిక క్షీణతను పొందింది.

సూపర్ మెటోర్
2024 మేలో 948 యూనిట్ల సూపర్ మెటోర్ ను విక్రయించింది. 2023 మేలో 838 యూనిట్లను విక్రయించింది. అంటే.. 110 యూనిట్లను తక్కువగా విక్రయించింది. 13.13% వార్షిక క్షీణతను పొందింది. ఈ విధంగా.. కంపెనీ 2024 మేలో మొత్తం 63,531 యూనిట్లను విక్రయించింది.