NTV Telugu Site icon

ACC Chairman Shammi Silva: ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త ఛైర్మన్‌గా షమ్మీ సిల్వా

Acc Shammi Silva

Acc Shammi Silva

ACC Chairman Shammi Silva: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక ఆటగాడు షమ్మీ సిల్వా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారతదేశానికి చెందిన జై షా స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మూడు పర్యాయాలు ACC ప్రెసిడెంట్ పదవిని చేసిన జై షా రాజీనామా చేసారు. ఇకపోతే, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC)లో సిల్వాకు ఇది మొదటి పాత్ర కాదు. ఆయన గతంలో ఈ సంస్థకు ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని షమ్మీ సిల్వా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. క్రికెట్ అనేది ఆసియా గుండె చప్పుడని, ఆటను ఉన్నతీకరించడానికి, అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు అవకాశాలను అందించడానికి ఇంకా అందరూ ఐక్యంగా ఉంచడానికి అన్ని సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.

Also Read: Digital arrest: ఎన్ఆర్ఐ సిస్టర్స్ “డిజిటల్ అరెస్ట్”.. రూ. 1.9 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు..

షమ్మీ సిల్వా మూడుసార్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాదు ఏసీసీలో కూడా పనిచేశారు. తన క్రికెట్ కెరీర్ గురించి చూస్తే.. అతను శ్రీలంక తరపున ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. అతను 4 ఫస్ట్ క్లాస్, 1 లిస్ట్ ఎ మ్యాచ్ మాత్రమే ఆడాడు. షమ్మీ సిల్వా క్రికెట్ కెరీర్ ప్రత్యేకంగా ఏమీ లేదు. అయితే, అడ్మినిస్ట్రేటర్‌గా శ్రీలంక క్రికెట్‌కు ఎన్నో మంచి పనులు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు చేపట్టారు. దీంతో అతను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాటు బీసీసీఐ కార్యదర్శి పదవికి కూడా షా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఒకే సమయంలో ఒక వ్యక్తి మాత్రమే ఒక పదవిని నిర్వహించగలడు. దీని కారణంగా త్వరలో బీసీసీఐలో పెద్ద మార్పును చూడవచ్చు.

Show comments