Site icon NTV Telugu

ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్‌కు సైన్యం అంగీకారం

సుప్రీం కోర్టు హెచ్చరిక తర్వాత ఆర్మీ మహిళలకు శాశ్వత కమిషన్‌ను నియమించేదందుకు అంగీకరించింది. అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ శాశ్వత కమీషన్ కోసం తమ దరఖాస్తులను తిరస్క రించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తామని నవంబర్ 12, శుక్రవారం ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆర్మీ అధికారులకు ఈ విషయంపై గతంలో ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడతారని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మహిళా అధికారుల విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఆర్మీ తెలిపింది.

మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు ప్రక్రియను నవం బర్ 26లోగా పూర్తి చేయాలని ఆర్మీని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహి ళా అధికారులకు ఆర్మీలో శాశ్వత కమిషన్ (పీసీ) ఉండేలా చూడాలని ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆర్మీలోని మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్‌ను మూడు నెలల్లోగా మంజూరు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Exit mobile version