NTV Telugu Site icon

AP High Court: జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వాలని హైకోర్టు సూచన

Ys Jagan

Ys Jagan

తన భద్రత కుదింపుపై ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయటం లేదని జగన్ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ ఎవరిది అని జడ్జి అడగ్గా ఇంటిలిజెన్స్ ది అని ప్రభుత్వం సమాధానమిచ్చింది. జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వచ్చు కదా అని ప్రభుత్వానికి న్యాయమూర్తి తెలిపారు. ప్రత్యామ్నాయంగా వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందా లేదో తెలుసుకుని చెబుతామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేశారు.

READ MORE: Manu Bhaker: స్వదేశానికి చేరుకున్న మను బాకర్‌.. ఢిల్లీలో ఘన స్వాగతం! శనివారం మళ్లీ పారిస్‌కు

దీంతో ఏపీ హైకోర్టు మధ్యాహ్నం 2.15కి విచారణ వాయిదా వేసింది. సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించిందని జడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని జగన్ లాయర్ వాదనలు వినిపించారు. గతంలో ఉన్న వారి స్థానంలో భద్రతను 58కి తగ్గించినట్టు కోర్టుకు తెలిపారు. ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ థ్రెట్ ఉందన్న లాయర్. జగన్ నివాసం, కార్యాలయం దగ్గర భద్రత తొలగించారని వాదన. జగన్ కు భద్రత తగ్గించలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. “చట్టప్రకారం ఇవ్వాల్సిన భద్రత ఇచ్చాని స్పష్టం. మాజీ సీఎంలకు ఎలాంటి భద్రత పాలసీ అవలంభిస్తున్నారని అడిగిన జడ్జి.. ప్రస్తుతం మాజీ సీఎంల భద్రతపై పాలసీ ఏమీ లేదంది ప్రభుత్వం. 2014 నుంచి పదేళ్లుగా పాలసీ లేదా అని జడ్జి ప్రశ్నించారు.

Show comments