NTV Telugu Site icon

Uncooked Bear Meat: ఉడకని ఎలుగుబంటి మాంసాన్ని తిన్న అమెరికన్‌ కుటుంబం.. మెదడుకు సోకిన పురుగులు..

Meat

Meat

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ నుండి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం., తక్కువ ఉడికించిన ఎలుగుబంటి మాంసం తిన్న తరువాత అమెరికన్ కుటుంబ సభ్యులు మెదడు పురుగుల బారిన పడ్డారని తెల్సింది. జూలై 2022లో మిన్నెసోటాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి జ్వరం, కండరాల నొప్పి, కంటి వాపుతో సహా వివిధ లక్షణాలతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ సంఘటన బయట పడింది. ఉత్తర సస్కట్చేవాన్లో ఒక కుటుంబ సభ్యుడు ఓ నల్ల ఎలుగుబంటి మాంసంతో తయారు చేసిన కబాబ్లను అక్కడ సభ్యులందరూ తిన్నారని అతడు వెల్లడించాడు.

ఇక ఆ మాంసం అప్పటికే ఒకటిన్నర నెల క్రితం నుండి ఫ్రీజర్లో నిల్వ చేసినప్పటికీ ఆ మాంసం వల్ల అనేక అనర్ధాలు జరిగాయి. ఇక ఆ సమయంలో మాంసం తక్కువగా ఉడికలేదని గమనించిన తరువాత, దానిని తిరిగి ఉడికించి మళ్లీ వడ్డించారని అతను తెలిపారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ప్రధానంగా మిన్నెసోటా, సౌత్ డకోటా, అరిజోనా నుండి కూడా ఆ భోజనంలో పాల్గొన్నారని తెలిపారు. ఇక ఆ వ్యక్తికి ‘ట్రైచినెల్లోసిస్’ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ చేసారు. ఇది అరుదైన రౌండ్వార్మ్ ఇన్ఫెక్షన్. ఇక కుటుంబ సభ్యులలో 12 ఏళ్ల బాలిక, కూరగాయలు మాత్రమే తిన్న ఇద్దరితో సహా మరో ఐదుగురు కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీజ్ రెసిస్టెంట్ పురుగులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముగ్గురినీ ఆసుపత్రిలో చేర్చి అల్బెండాజోల్ చికిత్స అందించారు.

ఇక కెనడా, అలాస్కాలో నాలుగింట ఒక వంతు నల్ల ఎలుగుబంట్లు ఈ పరాన్నజీవుల బారిన పడవచ్చని వారు గుర్తించారు. ఆ సంవత్సరం మొదట్లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ తన మెదడును ప్రభావితం చేసిన పరాన్నజీవి పురుగుతో తన అనుభవాన్ని వెల్లడించినప్పుడు ఈ మెదడు పురుగులు విషయం తెలిసింది. ఇక ఈ సంక్రమణ లక్షణాలలో వికారం, వాంతులు, తలనొప్పి, ఒక్కోసారి మూర్ఛలు కూడా సంభవించవచ్చు. అయితే కొంతమంది ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లక్షణరహితంగా ఉండవచ్చు.