మహారాష్ట్రలోని పుణెలో ఈ ఏడాది మే 19న మద్యం మత్తులో పోర్షే కారు మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇందుకు కారణమైన మైనర్ నిందితుడు డ్రైవింగ్ కోర్సు పూర్తి చేశాడు. కోర్టు ఆదేశం ప్రకారం.. అతను 15 రోజుల సేఫ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసినట్లు ఆర్టీఓ తెలిపారు. పుణెలోని కళ్యాణి నగర్‌లో జరిగిన ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు, యువతి మృతి చెందారు. ఇద్దరూ ఐటీ నిపుణులు మరియు పూణె కంపెనీలో పనిచేశారు. శిక్షణ కార్యక్రమంలో రహదారి డ్రైవింగ్ భద్రత, డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ప్రాముఖ్యత, రహదారి సంకేతాలు, చిహ్నాల అర్థం, ఇతర కార్యకలాపాల గురించి పూర్తిగా వివరించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మైనర్ నిందితుడిని మైదానంలో కి కూడా తీసుకెళ్లి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
READ MORE: Indian Coast Guard DG Rakesh: గుండెపోటుతో ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ రాకేష్ మృతి..
అసలేం జరిగింది..
మహారాష్ట్రలోని పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలోసాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
అయితే ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్‌స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్‌ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. 15 గంటల్లోనే బెయిల్ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.
READ MORE: Rishabh Pant: రిషబ్ పంత్లో ఈ కళ కూడా ఉందా.. వీడియో వైరల్
నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్‌ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు.
