Site icon NTV Telugu

Thatikonda Rajaiah : కేటీఆర్ నాకు ఎమ్మెల్సీ గానీ.. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఇస్తానన్నారు

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

గత కొన్ని రోజులుగా సందిగ్దత నెలకొన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సీటుపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇవాళ తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుపీరియర్ అని, గ్రామ కమిటీలు మండల కమిటీలు అన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేయడం జరిగిందన్నారు. కార్యకర్తలందరినీ సమన్వయం పరిచిన తర్వాతనే ప్రచారం చేద్దామన్నారు. కేటీఆర్ నాకు ఎమ్మెల్సీ గానీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడి గా ఇస్తానన్నారని ఆయన అన్నారు. కార్యకర్తల్లో నాయకులలో గందరగోళం సృష్టించొద్దని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గత ఎన్నికల్లో నాకు టికెట్ ఇస్తే కడియం శ్రీహరి తోపాటు, నాయకులందరినీ కలిసిన తర్వాతనే ప్రచారం మొదలు పెట్టానన్నారు.

Also Read : Land Issue: భూవివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఆరుగురు మృతి

నేను కార్యకర్తలను ఏనాడు తప్పు పట్టలేదు, కక్ష సాధింపు చేయలేదని ఆయన అన్నారు. చిన్న చిన్న ప్రలోభాలకు భయపడకుండా రాబోయే రోజుల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడానికి అందరూ సహకరించాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. రానున్న ఎన్నికల బీఆర్‌ఎస్‌ నుంచి 119 మందికి గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌. అయితే.. 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అందులో స్టేషన్‌ ఘన్‌పూర్‌ కూడా ఉంది. అయితే.. గత కొన్ని రోజులగా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యకు మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. నియోజకవర్గంలో జరిగే సభలు, సమావేశాల్లో ఒకరిపై ఒకరూ విమర్శలు గుప్పించుకున్నారు. అయితే.. వీరి పంచాయతీపై కేటీఆర్‌ దృష్టి సారించి పరిష్కరించినట్లు తెలుస్తోంది.

Also Read : Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. టర్కీ విషయంలో తప్పని అంచనా.. డచ్ సైంటిస్ట్ హెచ్చరిక

Exit mobile version