NTV Telugu Site icon

Bharateeyudu 2: ‘తాత వస్తాడే.. అదరగొట్టి పోతాడే..’ భారతీయుడు 2 నుండి మరోపాట విడుదల..

Barathiyudu 2

Barathiyudu 2

Bharateeyudu 2: యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న తాజా సినిమా ‘భార‌తీయుడు-2’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌గా.., 1996 కల్ట్ క్లాసిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన ఆడియో లాంచ్ ఇటీవ‌ల చెన్నైలో గ్రాండ్ గా నిర్వ‌హించారు చిత్ర బృందం.

Porn addiction: పోర్న్‌కి బానిసలవుతున్న అమెజాన్ జంగిల్ తెగలు.. ఎలాన్ మస్క్ కారణం..

కఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి ‘తాత వ‌స్తాడే.. అదరగొట్టి పోతాడే..’ అనే సాంగ్ ను లిరిక్ వీడియోను మేక‌ర్స్ విడుదల చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ తో ఈ సినిమాను మరో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లనున్న‌ట్లు అర్థ‌మవుతోంది. అదిరిపోయే బీట్స్ తో ఈ సాంగ్ ను అనిరుథ్ కంపోజ్ చేశారు. హీరో పాత్రను హైలైట్‌ చేసే ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ లో హీరో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ తమ డ్యాన్స్‌ తో ప్రేక్షకులను అలరించారు.

Prajavani: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం.. రాష్ట్ర ప్రణాళిక సంఘం..

క ఈ సినిమాలో క‌మ‌ల్ తోపాటు హీరో సిద్ధార్థ్, కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య‌, బాబీ సింహా, వివేక్, ప్రియా భ‌వానీ శంక‌ర్, బ్ర‌హ్మానందం లాంటి త‌దిత‌ర తారలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ వారు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాను జూలై 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు మూవీ మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

Show comments