Site icon NTV Telugu

Kanchana 4: ‘కాంచన 4’ లో నటించనున్న ఆ స్టార్ హీరోయిన్..?

Mrunaal

Mrunaal

Kanchana 4: రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా ,దర్శకుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.లారెన్స్ ఇటీవల నటించిన చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ మూవీస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఆతరువాత వచ్చిన కాంచన 2 ,కాంచన 3 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Read Also :Rakul preet Singh : ఆ సినిమా నా కెరీర్ లో స్పెషల్ మూవీ..

తాజాగా “కాంచన 4 ” సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను తీసుకునేందుకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.ఈ సినిమాను కూడా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి ,నిర్మించనున్నారు.అయితే ఎంతో సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకునే మృణాల్ యాక్టింగ్ కు స్కోప్ ఉంటే ఎలాంటి పాత్ర అయిన కూడా చేయడానికి సిద్ధంగా ఉంటుంది.దీనితో ఈ సినిమాలో ఆమె నటిస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.కాంచన 4 సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.ఈసారి ఎలాంటి కథతో రానున్నారో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version