NTV Telugu Site icon

Rathnam Twitter Review : ఆ మాస్ కాంబో హాట్రిక్ కొట్టినట్లేనా..?

Whatsapp Image 2024 04 26 At 9.26.41 Am

Whatsapp Image 2024 04 26 At 9.26.41 Am

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో వచ్చ్హిన లేటెస్ట్ మూవీ “రత్నం”.ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఇదివరకే పూజ ,భరణి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రత్నం మూవీ హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కింది.. జీ స్టూడియోస్‌ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.ఇదిలా ఉంటే హీరో విశాల్ కు తెలుగులో కూడా మాస్ ఫాలోయింగ్ వుంది.రత్నం మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేసారు.ఈ మూవీని తెలుగులో శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద సీహెచ్ సతీష్ కుమార్ మరియు కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.దేవిశ్రీ , విశాల్ కాంబోలో వస్తున్నా మొదటి మూవీ కావడంతో “రత్నం” సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి .దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఏప్రిల్ 26న అంటే నేడు ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పడిన పలు ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ రత్నం మూవీపై సోషల్ మీడియా వేదికగా రత్నంపై రివ్యూలు ఇస్తున్నారు.

సినిమాలో పాటలు సూపర్ గా ఉన్నాయి. ఎమోషన్స్ కూడా అదిరిపోయాయి. స్క్రీన్‌ప్లే మరింత అదిరిపోయింది. విశాల్ నటించిన సినిమాల్లో ఇది కూడా ఒక వందశాతం బెస్ట్ సినిమా. రత్నం బాగుంది” అనే మీనింగ్ వచ్చేలా ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు .రత్నం సినిమాలో అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉందని కొందరు నెటిజన్స్ రివ్యూలు ఇస్తున్నారు.ఈ సినిమాలో విశాల్ నటన అదిరిపోయిందని అంటున్నారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్ అలాగే ప్రియా భవానీ శంకర్ మధ్య ఎమోషన్స్ అదిరిపోయాయట .

ఈ సినిమాలో గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు మరియు మురళీ శర్మ తమ పాత్రల్లో అద్భుతంగా నటించినట్లు నెటిజన్స్ రివ్యూలు ఇస్తున్నారు.అయితే ఈ సినిమాలో ప్రేక్షకుడు విజిల్స్ వేసి ఇంటెన్సివ్ గా చూసే సీన్స్ అంతగా లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం .దీనితో రత్నం సినిమా లాజిక్ లెస్ యాక్షన్ డ్రామాగా నిలిచిందని తెలుస్తుంది. మొత్తానికి భారీ యాక్షన్ సినిమాగా వచ్చిన రత్నం ఒక సిల్లీ డ్రామా అయిపోయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే, విశాల్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు.అయితే ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో ఈ సినిమా లేదని రివ్యూలు వస్తున్నాయి.

Show comments