NTV Telugu Site icon

NBK 109 : బాలయ్య మూవీలో కన్నడ స్టార్ నటుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

Rishi

Rishi

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.” NBK109 “అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది,దర్శకుడు బాబీ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Read Also :Balakrishana : త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..

అలాగే టాలీవుడ్ బ్యూటీ చాందిని చౌదరి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసింది.తాజాగా బాలయ్య బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలావుంటే మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ నుంచి విల‌న్ రోల్ అప్‌డేట్ ఇచ్చారు.ఈ సినిమాలో క‌వ‌లుదారి చిత్రం ఫేమ్ క‌న్న‌డ యాక్టర్ “రిషి” విల‌న్ పాత్ర‌లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శుక్ర‌వారం రిషి పుట్టిన‌రోజు సందర్భంగా అతనికి బర్త్ డే విషెస్ తెలుపుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమా టైటిల్ , రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

Show comments