NTV Telugu Site icon

NTR 31 : ఎన్టీఆర్ సరసన నటించనున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

Ntr

Ntr

NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు.ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర “..దర్శకుడు కొరటాల ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Read Also :Katrina Kaif : కత్రీనా కైఫ్ బేబీ బంప్స్ ఫొటోస్ వైరల్..

ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన “ఫియర్ సాంగ్”ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది.ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.ఎన్టీఆర్ పుట్టినరోజు తన మరో మూవీ అప్డేట్ కూడా వచ్చింది.ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానున్నదని మేకర్స్ తెలిపారు.ఈ సినిమాకు “డ్రాగెన్” అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే మేకర్స్ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.

Show comments