NTV Telugu Site icon

Jailer 2 : తూచ్ అంతా ఉత్తిదే.. జైలర్ 2 ఆ బ్యూటీ లేదట

Jailer

Jailer

Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా మరోసారి చూపించింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ మాత్రం సూపర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది. మిడిల్ ఏజ్ లుక్కే అయినా రజినీ యాక్షన్ సీన్స్ అన్నీ ఫ్యాన్స్ కి బూస్ట్ అందించాయి. జైలర్ హిట్ తో తిరిగి ఫాం లోకి వచ్చిన రజిని ఈ ఇయర్ వేట్టయ్యన్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నారు. తర్వాత రజిని జైలర్ 2 ని చేస్తున్నాడని తెలుస్తోంది. సూపర్ స్టార్ బర్త్ డేకి సినిమా ప్రకటించగా అభిమానులంతా ఈ సీక్వల్ పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. జైలర్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు నెల్సన్. జైలర్ యాక్షన్ సీన్స్ కి సూపర్ క్రేజ్ రాగా పార్ట్ 2 లో అంతకుమించి ఫైట్ సీన్లు ఉండేలా చూసుకుంటున్నాడు.

Read Also:Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే..

అంతేకాదు ఈసారి గ్లామర్ పరంగా కూడా ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జైలర్ 2 లో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టిని కూడా సెలక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.. ‘జైలర్‌ 2’లో ఇంకా శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేయలేదని, ఒకవేళ ఆమెను ఫైనల్ చేస్తే.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామంటూ మేకర్స్ తెలియజేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్ సినిమాలో శ్రీనిధి శెట్టి ఇంకా ఫైనల్ కాలేదని క్లారిటీ అయితే వచ్చింది. ఇక ‘జైలర్‌ 2’ చిత్రీకరణ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ ‘జైలర్ 2’లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు.

Read Also:Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూకి ‘‘ప్రొస్టేట్ రిమూవల్ సర్జరీ’’

Show comments