Site icon NTV Telugu

Thangalaan : అంచనాలను పెంచేస్తోన్న విక్రమ్ ‘తంగలాన్’

Chiyaan Vikram

Chiyaan Vikram

Thangalaan : ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుల్లో చియాన్‌ విక్రమ్‌ ఒకరు. అపరిచితుడుగా తనకంటూ బ్రాండ్ ఇమేజును సొంతం చేసుకున్నారు. విక్రమ్ అంటే నేడు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. శివ పుత్రుడు సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను విక్రమ్ తన అభిమానులను పలకరిస్తుంటారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాలో నటించారు. ఆ చిత్రం హిట్ అవడంతో అదే జోష్ లో ప్రస్తుతం ‘తంగలాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన విక్రమ్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సోమవారం విక్రమ్‌ బర్త్‌డే సందర్భంగా మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ వీడియో అద్భుతంగా ఉంది.

Read Also: Madhavan : పుత్రోత్సాహంతో మాధవన్.. 5బంగారు పతకాలు సాధించిన కొడుకు

పాత్ర డిమాండ్ చేసే ఎంతటి కష్టమైనా పెట్టే విక్రమ్.. తంగలాన్ కోసం తన దేహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. టోటల్ డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ వేశదారణ సినిమాకే హైలెట్ కానుంది. సినిమాకు జీవీ ప్రకాశ్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. వీడియో చివర్లో వచ్చే సీన్.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 19వ శతాబ్దంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్ నేపథ్యంలో తంగలాన్ తెరకెక్కుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ దీనిని విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్‌ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్‌, పార్వతి నటిస్తున్నారు.

 

Exit mobile version