తెలుగు చిత్ర పరిశ్రమలో థమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్స్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.. ఇలా తను కంపోజ్ చేసే మ్యూజిక్ అంతా కూడా ఇతర సినిమాల నుంచి కాపీ చేస్తున్నారు అంటూ థమన్ పై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.కొంతమంది ట్రోలర్స్ అయితే థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కనుక విడుదల అయితే ఆ సాంగ్ బాగుందా లేదా అని కాకుండా ఈ సాంగ్ ఏ సినిమాలో నుంచి కాపీ చేసారా అని వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు.. అలాగే ఆయనపై నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.అయితే వరుసగా తన గురించి వస్తున్న ఈ కామెంట్స్ పై తాజాగా బ్రో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.ఇకపోతే చాలామంది తనని మ్యూజిక్ మానేసి క్రికెట్ ఆడటానికి వెళ్తాడు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారని థమన్ తెలిపారు. నిజంగానే నేను క్రికెట్ ఆడటానికి వెళ్తాను కానీ నా సినిమా పనులను విడిచిపెట్టి నేను ఎప్పుడూ కూడా వెళ్ళను. అలా వెళ్తానని ఇప్పటివరకు నా గురించి ఏ దర్శకుడు కానీ నిర్మాత కానీ ఫిర్యాదు చేయలేదు నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కనుక రాత్రి తొమ్మిది గంటలకు క్రికెట్ ఆడి నేను పడుకుంటాను అని తెలిపారు. అలాగే మరుసటి రోజు నా పని నేను చూసుకుంటాను..క్రికెట్ అంటే నాకు ఇష్టం దానిని నేను ఒక ఎక్సర్సైజ్ లాగానే భావించి ప్రతిరోజు ఆడతానని ఆయన తెలిపారు..
ఇక క్రికెటర్స్ లో నాకు ధోని అంటే ఎంతో ఇష్టం అని థమన్ తెలిపారు. ఇష్టం అని చెప్పడం కన్నా పిచ్చి అంటే బాగుంటుంది. అయితే నేను ఎప్పుడూ ధోనిని ఆదర్శంగా తీసుకుంటాను.మ్యాచ్ సరిగా ఆడకపోతే తనని ఎంతోమంది విమర్శిస్తారు. నన్ను కూడా అలాగే ఒక పాట సరిగా రాకపోతే నువ్వు ఇండస్ట్రీకి పనికి రావు అంటూ ట్రోల్ చేస్తారని థమన్ తెలిపారు.ఇక ధోని పిచ్ పై అడుగు పెట్టగానే వేలమంది అరుస్తూ కేరింతలు కొడతారు.. ఆ ఒత్తిడిని ధోని ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తారు ఈ విషయాన్ని నేను ధోని నుంచి చూసి నేర్చుకున్నాను .ఇలా క్రికెట్ రంగంలో మంచి సక్సెస్ సాధించిన ఈయన సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఇక సినిమాలలో ధోని తనకు అవకాశం కనుక ఇస్తే ఎలాంటి పారితోషకం తీసుకోకుండా తన సినిమాకు ఫ్రీగా మ్యూజిక్ అందిస్తాను అని థమన్ తెలిపారు..