మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ. జ్ఞాన భూమి వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ లు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో పుట్టిన పీవీ అంచెలంచెలుగా ఎదిగారు అని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పని చేశారు అని మంత్రి తలసాని అన్నారు.
Read Also: Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ఓఐఎస్ ఫీచతో కెమెరా! ధర ఎంతంటే
పీవీ నరసింహారావు తెలుగు సంప్రదాయంలో టివిగా కనిపించేవారు.. దేశంలో ఇప్పుడు అనేక డ్రామాలు నడుస్తున్నాయి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణలు తీసుకురాకపోతే దేశం ఏమీ అయ్యేది అనేది అందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీకీ భారత రత్న బిరుదును ఇవ్వాలి అని తలసాని డిమాండ్ చేశారు. పీవీకీ భారత రత్న ఇవ్వడం వల్ల దేశ ప్రతిష్ట, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది అని అన్నాడు. పీవీకీ భారత రత్నపై పోరాడుతాం.. పార్లమెంట్ లో గళమెత్తుతాం.. పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోతారు అని మంత్రి తలసాని తెలిపారు.
Read Also: Forehead Lines: నుదుటి రేఖలు మీరు ఎంత ధనవంతులు అవుతారో తెలియజేస్తాయంట..!
పీవీ నరసింహారావు బహు భాషా కోవిదుడిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పీవీ స్ఫూర్తిదాయకం.. తెలంగాణ గడ్డపై పుట్టడం మన అదృష్టం అని ఆమె తెలిపారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి తెలంగాణ సత్తా చాటారు. దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి మార్గదర్శకంగా నిలిచారు. పీవీ స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు. ప్రపంచంలోనే అపర చాణక్యుడిగా పీవీ పేరు పొందారు అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.