Site icon NTV Telugu

Thalapathy Vijay: సంక్రాంతి బరిలో దళపతి విజయ్ మూవీ..

Thalapathy Vijay

Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్‌ అభిమానులకు గుడ్ న్యూస్.. విజయ్‌ ‘జన నాయగన్‌’ సినిమా వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి బరిలో దళపతి మూవీ నిలవబోతుంది. అది ఎలా అనుకుంటున్నారా.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన ‘జన నాయగన్‌’ సెన్సార్‌ ప్రాబ్లమ్స్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తమ అభిమాన హీరో సినిమా, అది కూడా లాస్ట్ మూవీగా వస్తున్న చిత్రం రిలీజ్ వాయిదా పడటంతో ఒక్కసారిగా వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాంటి టైంలో విజయ్ అభిమానులకు నిర్మాత కలైపులి ఎస్‌.థాను గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా..

READ ALSO: Janasena : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన..

2016లో విజయ్‌ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తేరి’. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదలైంది. ఆ టైంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యి వెండి తెరపై అఖండ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ‘తేరి’ రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా జనవరి 15న తమిళనాడులో రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాత కలైపులి ఎస్‌.థాను ప్రకటించారు. ఈ ప్రకటనతో విజయ్‌ అభిమానుల్లో సంతోషం నెలకొంది. పొంగల్‌కు ‘జన నాయగన్‌’ సినిమాతో అలరిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న దళపతి కనీసం తేరి రీ రిలీజ్‌తో అయిన వెండితెరపై కనిపించబోతున్నాడని విజయ్ అభిమానులు ఆనంద పడుతున్నారు.

READ ALSO: Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’కు ఫ్యామిలీ ఆడియన్స్ బూస్ట్..

Exit mobile version