NTV Telugu Site icon

Vijay : తమిళ రాజకీయాల్లో సంచలనం.. 100నియోజక వర్గాల్లో విజయ్‌ పాదయాత్ర

New Project 2024 07 22t110443.923

New Project 2024 07 22t110443.923

Vijay : తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (2026) సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయ‌న త‌న పార్టీ రూపు రేఖల మీద దృష్టిపెట్టారు. 2026 ఎన్నికల్లో అఖండ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ పోరులో ఒంటరిగా పోటీ చేసి 5వ కూటమిగా నిలుస్తారా..? పొత్తు పెట్టుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. పాదయాత్రతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also:Rangam Bhavishyavani: రక్త పాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు..

పార్టీకి అనుబంధంగా 30 శాఖలు ఏర్పాటు చేయడమే కాకుండా 2 లక్షల మందికి పదవులు కట్టబెట్టేందుకు కృషి చేస్తున్నారు. తమ పార్టీకి జెండాను, ఎన్నికల గుర్తును కేటాయించాలని విజయ్ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈసీ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. వారి నుంచి ప్రకటన రాగానే భారీ సభ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సభలో పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రకటించాలనే వ్యూహంతో విజయ్ ఉన్నారు.

Read Also:YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!

పార్టీ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత రాష్ట్రవ్యాప్తంగా విజ‌య్ పాదయాత్ర చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సెప్టెంబర్-నవంబర్ నెలల్లో ఆయన ప్రజల్లోకి వస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తిరుచ్చి వేదికగా రాజకీయంగా తొలి అడుగు వేయాలనుకుంటున్నాడు విజయ్. ఈ మేరకు పార్టీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. గత కొద్ది రోజులుగా విజయ్ మాట తీరు పరిశీలిస్తే.. డీఎంకే, బీజేపీకి వ్యతిరేకమన్న భావన కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన ఏఐఏడీఎంకేతో కలిసి పోటీ చేయవచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే విజయ్ స్వయంగా సీఎం అభ్యర్థి అయ్యే ఛాన్స్ ఉంది.