తమిళ హీరోయిన్ విజయ్ పోలీసులకు ఫైన్ కట్టాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. విజయ్ మంగళవారం చెన్నై నగరంలో రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు ఫైన్ విధించారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా లియో లో విజయ్ నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.. ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే మరోవైపు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు.. సినిమా షూటింగ్ అనంతరం విజయ్ పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు.
ఈ క్రమంలో తరచుగా విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులతో భేటీ అవుతున్నారు. మంగళవారం చెన్నైలోని పనయూర్ ఆఫీస్ లో ఆయన విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులను కలిశారు. మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా అభిమానులు పెద్ద మొత్తంలో కారును వెంబడించారు.. ఇక వారి నుంచి తప్పించుకొనే పనిలో రెండు చోట్ల సిగ్నల్ క్రాస్ చేసింది. కారు నెంబర్ ఆధారంగా అది విజయ్ కి చెందినదని సమాచారం సేకరించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు రూ. 500 జరిమానా విధించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
ఇకపోతే విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటి చెయ్యనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బెయిల్ రానుందట. ఇప్పటికే ఆ పార్టీ నాయకుల తో విజయ్ భేటీ అవుతున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం మాత్రమే ఉంది.. అయితే విజయ్ ఇప్పటి నుంచే రాజకీయ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నాడు.. లియో తర్వాత వెంకట ప్రభు సినిమాలో నటించనున్నాడు.. ఆ తర్వాత ఎన్నికలు అయ్యే వరకు సినిమాలకు విరామం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. దీని గురించి త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర కూడా చేసే అవకాశం ఉందట . మీడియాలో విజయ్ పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వినిస్తున్నాయి..
Just IN : Joseph Vijay fined for jumping red signal. pic.twitter.com/7sQUKNcujG
— Manobala Vijayabalan (@ManobalaV) July 11, 2023
