Site icon NTV Telugu

Thalapathy Vijay : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడిన ‘దళపతి విజయ్’

Thalapathyvijay

Thalapathyvijay

అభిమానుల అత్యుత్సహం రోజురోజుకి హద్దు మీరుతోంది. ఇటీవల టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు అందరికి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం సమంతకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అభిమానం పేరుతో ఫ్యాన్స్ నటీనటులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఫ్యాన్స్ తీరుతో అసహనం వ్యక్తం చేశాడు. మలేషియాలో జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ముగించి తమిళనాడు చేరుకున్నాడు విజయ్. ఈ నేపధ్యంలో  విజయ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దళపతి విజయ్‌ రాక కోసం భారీగా అభిమానులు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

భారీ జనసందోహం మధ్యలో విజయ్ తన కారులో ఎక్కేందుకు వెళుతుండగా అభిమానుల తోపులాట మధ్య విజయ్ కాలుజారి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విజయ్ ను చుట్టుముట్టి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.అదృష్టవశాత్తూ విజయ్‌కు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సేఫ్‌గా ఉన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణంగా తగిన స్థాయిలో క్రౌడ్ కంట్రోల్ లేకపోవడమేనని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అలాగే “తలపతి సేఫ్” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ట్రెండింగ్ చేశారు. అదే సమయంలో ఇలాంటి సందర్భాల్లో విజయ్ భద్రతపై మరింత దృష్టి పెట్టాలని ఆయన ఫ్యాన్స్ అభిమానులు కోరుతున్నారు. ఏదేమైనా అభిమానం కొంత వరకు ఉంటె ఓకే కానీ ఇలా వారిని ఇబ్బంది పెట్టడంకరెక్ట్ కాదు.

Exit mobile version