Condoms: వాలెంటైన్ డే స్పెషల్.. ఫ్రీగా 9.5కోట్ల కండోమ్స్ పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Condoms: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు తమ దేశవ్యాప్తంగా 9.5కోట్ల ఉచిత కండోమ్స్ పంపిణీ చేయాలని తలంచింది. పర్యాటకుల స్వర్గధామంగా థాయిలాండ్ దేశాన్ని భావిస్తారు. ఫిబ్రవరి 1 నుంచే థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. మామూలు రోజుల్లోనే థాయిలాండ్ లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక వాలంటైన్స్ డే అంటే.. ప్రేమికులంతా థాయిలాండ్‌లో విచ్చలవిడిగా రెచ్చిపోతారు. ఆ తర్వాత శృంగారానికి సిద్ధమవుతారు. సాధారణంగా సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదం కూడా ఉంది. ఆ తర్వాత వారంతా అబార్షన్లకు ప్రయత్నిస్తే అది మరో పెద్ద సమస్య. అందుకే అలాంటి సమస్యలేవీ లేకుండా ముందుగానే ప్రభుత్వం 9కోట్ల 50 లక్షల కండోమ్ లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. థాయిలాండ్ హెల్త్ కేర్ కార్డ్ కలిగి ఉన్నవారికి వారానికి 10 కండోమ్ లు ఉచితంగా ఇస్తారు.
Read Also: Bengaluru: దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని యువకుడి దారుణ హత్య
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
ఇలా ఏడాదిపాటు వారికి ఉచితంగా కండోమ్ లు అందిస్తారు. ఇక ప్రభుత్వం ఇచ్చే ఉచిత కండోమ్ లు మెడికల్ షాపుల్లో, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి. అవి కూడా 4 సైజుల్లో అందుబాటులో ఉంటాయట. ఆస్పత్రికి, లేదా మెడికల్ షాపుకి వెళ్లి సైజ్ చెప్పి.. కండోమ్ ఉచితంగా పొందవచ్చు. 2021లో 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న థాయిలాండ్ బాలికల్లో ప్రతి వెయ్యి మందికి 25 మంది అమ్మాయిలు అవాంఛిత గర్భం దాల్చారు. ఇలాంటి ముప్పులను నివారించాలంటే, కండోమ్ లను ఉచితంగా అందించడం ఒక్కటే మార్గం అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కోట్లాది కండోమ్ లు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అలా థాయిలాండ్ లో సెక్స్ తో వచ్చే వ్యాధులను, టీనేజ్ గర్భాలను అడ్డుకోవాలని చూస్తోంది. థాయిలాండ్ లో యువత ఎక్కువగా సుఖ వ్యాధుల బారిన పడుతుంది. గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్, క్లెమిడియా అనే వ్యాధులు అక్కడ ఎక్కువ. అందులోనూ వాలంటైన్స్ డే సీజన్లో ఇలాంటి వ్యాధులు మరింత విజృంభిస్తుంటాయట. ముఖ్యంగా 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత ఈ వ్యాధులబారిన పడటం ఆందోళన కలిగించే విషయం.
Read Also:BRS in AP: ఏపీలో బీఆర్‌ఎస్ బిగ్ ప్లాన్..! గంటా, సీబీఐ మాజీ జేడీతో వివేక్ భేటీ..
తాజావార్తలు
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?