NTV Telugu Site icon

Ponzi Scam : స్కీం పేరుతో స్కాం.. దంపతులకు 12,640ఏళ్ల జైలు శిక్ష

Thailand

Thailand

Ponzi Scam : థాయ్ లాండ్ లో తప్పు చేస్తే శిక్షలు ఘోరంగా ఉంటాయి. నేరాలు చేసిన వాళ్లకి అక్కడ కోర్టులు కఠిన శిక్షలు వేస్తున్నారు. తాజాగా ఓ దంపతులకు కోర్టు సంచలన శిక్ష వేస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఆన్ లైన్ పోంజి స్కీం పేరుతో సోషల్ మీడియాలో మోసానికి పాల్పడిన భార్యభర్తలకు ఒక్కొక్కరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Read Also: Drugs : దేశ చరిత్రలోనే భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత.. విలువ వేలకోట్లు

వివరాల్లోకి వెళితే.. వాంటనీ తిప్పావెత్, మేతి చిన్ఫా పాంజీ దందపతులు..తమ దగ్గర పొదుపు చేస్తే ఎన్నో రెట్లు అదనంగా సొమ్ములు ఇస్తామని జనాలను మోసగించారు. దీంతో వారికి థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. వీరు 2019లో పోంజి మోసానికి తెర లేపారు. తమ దగ్గర డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని ప్రకటించారు. స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంజి పథకంలో చేరాలంటూ ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్ లైన్ లో ఉంచి ప్రలోభ పెట్టేవారు. ఈ విధంగా వచ్చిన డబ్బుతో తాము ఒక జ్యూయెలరీ షాప్ ను కూడా కొనుగోలు చేశానంటూ రకరకాల నగలు ధరిస్తూ వాంటనీ ఆ వీడియోలో చూపిస్తూ రెచ్చగొట్టేవారు.

Read Also:Gujarat: గుజరాత్ లో విషాదం.. నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం

నిజానికి తన ఆఫీస్ లోని రూమ్ నే నగల షాప్ గా భ్రమింపజేసేలా వారు నకిలీ వీడియోను తయారు చేశారు. దీంతో 2500 మందికి పైగా వారి పథకంలో పెట్టుబడి పెట్టారు. సుమారు 51.3 మిలియన్ డాలర్లు సేకరించి దంపతులు ఎత్తి వేశారు. దీంతో వీరిపై కేసు నమోదైంది. విచారణలో థాయ్ లాండ్ క్రిమినల్ కోర్టు వీరికి 12,640 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే నిందితులు నేరాన్ని అంగీకరించడంతో జైలు శిక్షను 5,056 ఏళ్లకు తగ్గించారు. నిజానికి వారికి అన్ని ఏళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ థాయ్ లాండ్ చట్టం ప్రకారం దంపతులు ఒక్కొక్కరు 20 ఏళ్లు మాత్రమే ఆ దేశం జైలులో ఉంటారని ఒక అధికారి పేర్కొన్నారు.