Thailand: ఒక మనిషి కేవలం బీరు తాగి ఎంతకాలం జీవించగలడు..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకక పోవచ్చు. కానీ.. థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇది ట్రై చేసి చివరికి మరణించాడు. Odditycentral.com నివేదిక ప్రకారం.. థాయిలాండ్‌లోని రేయాంగ్‌లో అధికంగా బీర్లు తాగి ఓ వ్యక్తి మరణించాడు. అతని ఇంట్లో 100 కి పైగా ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. అన్ని సీసాలు బెడ్‌రూంలో నేలపై పేర్చారు. ఆ వ్యక్తి ఒక నెలకు పైగా ఆహారం మానేసి కేవలం బీరు తాగి కడపు నింపుకున్నాడు.
రాయోంగ్, బాన్ చాంగ్ జిల్లాలోని ఒక ఇంట్లో 44 ఏళ్ల తవీసక్ నామ్వోంగ్సా, తన 16 ఏళ్ల కుమారుడితో కలిసి నివాసం ఉన్నాడు. అతడు తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. తాజాగా తవీసక్ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుమారుడు గమనించాడు. ఈ అంశంపై రెస్క్యూ టీంకి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ బెడ్ రూమ్ లో 100 కి పైగా ఖాళీ బీర్ బాటిళ్లు క్రమ పద్ధతిలో పేర్చి ఉండటాన్ని టీం సభ్యులు గమనించారు. మధ్యలో ఓ మంచం, ఆ మంచంపై నామ్వోంగ్సా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
READ MORE: CM Chandrababu: పీ4 లోగో ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
అతని కుమారుడు పోలీసులకు తెలిపిన వివారాల ప్రకారం.. నామ్వోంగ్సా ఒక నెలకు పైగా బీరు మాత్రమే తాగాడు. ఏమీ తినలేదు. తాను రోజూ పాఠశాల నుంచి తిరిగి వచ్చాక తన తండ్రికి వేడి ఆహారం వండి పెట్టేవాడినని, కానీ ఆయన తినేవాడు కాదని ఆ బాలుడు వివరించాడు. తన తండ్రికి ఉన్న ఇతర అనారోగ్య సమస్యల గురించి తనకు తెలియదని చెప్పాడు. విడాకులు తీసుకున్న తరువాత తవీసక్ నామ్వోంగ్సా మద్యానికి బనిసయ్యాని తెలిపాడు. కాగా.. బీరులో కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ, అందులో అవసరమైన పోషకాలు ఉండవు. దానిని ఆహార ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడతాయి. పోషకాలు లేకపోవడమే కాకుండా.. కాలేయాన్ని దెబ్బతీసే అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఆల్కహాల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
