Site icon NTV Telugu

TGSRTC Strike: ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌.. ఎప్పటినుంచంటే?

Tgsrtc

Tgsrtc

TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. ఉద్యోగుల డిమాండ్ల‌పై రాష్ట్ర కాంగ్రెస్ స్పందించ‌క‌పోవ‌డంతో మే 7వ తేదీ నుండి నిర‌వ‌ధిక స‌మ్మె చేయాల‌ని ఆర్టీసీ కార్మిక సంఘాలు (JAC) నిర్ణ‌యించాయి. ఈ సందర్బంగా సమ్మె సంబంధించిన పోస్టర్ ను ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆవిష్కరించింది. మే డే స్పూర్తితో ఆర్టిసి సమ్మెకు సిద్దం అయ్యింది జేఏసీ. ఇప్పటికైన అయిన ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని, మా న్యాయమైన డిమాండ్ ల పై స్పందించాలని జేఏసీ నాయకులూ అన్నారు. ఇక సమ్మెకు ముందు ఆర్టిసి కార్మికులు మే 5 న కార్మిక కావతు చేపడుతున్నామని, ఆర్టీసీ కళ్యాణ మండపం నుండి బస్సు భవన్ వరకు సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ యూనిఫారంలో కవాతు చేపట్టబోతున్నట్లు తెలిపారు.

Read Also: Vaibhav Suryavanshi: ఒక్క సెంచరీ.. రికార్డులే కాదు.. రూ.10 లక్షల రివార్డులు కూడా!

ఇకపోతే, కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జేఏసీలోకి వస్తామని, మళ్లీ యాజమాన్యాలకు మద్దతుగా మాతో కలవడం లేదని.. యూనియన్ లకు అతీతంగా అందరూ సమ్మెకు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ విలీనాన్ని సీఎం చేపట్టాలని, ప్రజాపాలన చేయాలని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రైవేటీకరణ మూలమైన ఎలక్ట్రిక్ బస్సు లను ఆర్టీసీ యాజమాన్యం కొని నడపాలని, 2021 వేతన సవరణ చేపట్టాలని వారు కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసి కార్మికులకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. 16 వేల మంది రిటైర్ అయిన ఖాళీలను భర్తీ చేయాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేసారు.

Exit mobile version