2025 దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు సొంతుళ్లకు పయనమవుతున్నారు. ప్రస్తుతం బస్‌స్టాండ్‌లు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకి ప్రత్యేకంగా 7754 బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు ఆరంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టాండ్‌లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు.
Also Read: TS Colleges Shut Down: దసరా తర్వాత విద్యా సంస్థలు బంద్!
గతంలో పండగలకు జనాలు ఆర్టీసీ బస్సులలో కిక్కిరిసిన రద్దీతో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పండగలకు అధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేయడంతో.. ప్రయాణికులు ప్రశాంతంగా జర్నీ చేస్తున్నారు. బస్సులు చాలా ఉండడంతో చాల మంది ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2013 జీవో ప్రకారమే పండగలకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. రిటర్న్ జర్నీ ఖాళీగా రావాల్సి వస్తుండటంతో.. చాలా మినిమం చార్జీలు వసూలు చేస్తున్నామని తెలిపారు. రేపే దసరా కాబట్టి ఇప్పటికే సగానికి పైగా సిటీ ఖాళీ అవ్వగా.. రాత్రికి మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
