Site icon NTV Telugu

Hyderabad: విద్యుత్ సిబ్బందిపై దాడి చేస్తే చట్టపరమైన చర్యలు- TGSPDCL CMD

Tsgenco

Tsgenco

విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ అధికారులపై, సిబ్బంది పై దాడి చేయడం, విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ హెచ్చరించారు. నిన్న (గురువారం) బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీ నగర్ లో జరిగిన సంఘటనలో గాయపడిన సిబ్బంది గణేష్, శ్రీకాంత్ మరియు భాస్కర్లను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజినీర్ చంద్ర శేఖర్ను, డివిజనల్ ఇంజినీర్ గ్రీన్ ల్యాండ్స్ సుధీర్లను ఆదేశించారు.

Read Also: Microsoft Outage Live Updates : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్

గురువారం బంజారాహిల్స్ సర్కిల్లో లైన్ ఇన్స్పెక్టర్ రోజూ లాగానే ఇంటింటికి తిరుగుతూ విద్యుత్‌ బకాయిలపై సమాచారం ఇస్తూ ఈతేదీ లోపు చెల్లించాలని కోరుతూ వెళుతున్నాడు. అయితే ఓ ఇంటి వద్దకు వెళ్లి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని కోరాడు. దీనిపై లైన్ ఇన్స్పెక్టర్ను ఇద్దరు యువకులు ఎందుకు చెల్లించాలని కోరారు. విద్యుత్‌ బకాయిలు ఉందని మీరు కట్టకపోతే లైన్‌ కట్‌ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు లైన్ ఇన్స్పెక్టర్ పై విచక్షణా రహితంగా దాడికి దిగారు. లైన్ ఇన్స్పెక్టర్ను దుర్భాష లాడుతూ పొట్టుపొట్టు కొట్టాడు. లైన్ ఇన్స్పెక్టర్ పొట్టలో పిడుగుద్దులు కొట్టడంతో దీంతో లైన్ ఇన్స్పెక్టర్ అక్కడే కూలబడిపోయాడు.

Read Also: Allu Aravind: మీ బామ్మర్దితో సినిమా చేస్తున్నామని ఎన్టీఆర్ కి ఫోన్.. షాకింగ్ సమాధానం!

Exit mobile version